సొంతూరి బాట పట్టిన జనం…ఓట్లు వేయడానికి స్వగ్రామాలకు..

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సోమవారం పోలింగ్ ఉండడంతో ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు బయలుదేరారు.

Update: 2024-05-12 11:13 GMT

 దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సోమవారం పోలింగ్ ఉండడంతో ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు బయలుదేరారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవుపల్లి, కాటేదాన్, గగన్ పహాడ్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. అదేవిధంగా రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చాలామంది నివాసం ఉంటున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వలస వచ్చి కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరంతా స్వగ్రమాలకు ఓటు వేసేందుకు ఆరంగర్ చౌరస్తా నుంచి బయలుదేరారు. వేలాదిమంది ఇక్కడి నుంచి వెళ్తుండటంతో ఆరంఘర్ చౌరస్తా జనసంద్రంగా మారింది. అక్కడి నుంచి మహబూబ్నగర్, జడ్చర్ల తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తున్నారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

దోచుకుంటున్న ప్రైవేటు వాహనదారులు

సందట్లో సాడే మియా అన్న చందంగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వారు అందిన కాడికి దోచుకుంటున్నారు.


Similar News