అంగరంగ వైభవంగా అనంత పద్మనాభ స్వామి కళ్యాణం

మండల పరిధిలోని పెంజర్లలో స్వయంభుగా కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

Update: 2024-05-23 11:55 GMT

దిశ, కొత్తూరు : మండల పరిధిలోని పెంజర్లలో స్వయంభుగా కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ కమటీ చైర్మన్ అనితారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల

    నడుమ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన చిన్న పిల్లల సంప్రదాయ నృత్య ప్రదర్శన అందరినీ కట్టి పడేసింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అనితా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి , ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, పెంజర్ల మాజీ సర్పంచ్ వసుంధరా రెడ్డి , ఆలయ కమిటీ మెంబర్ దామోదర్ రెడ్డి, వన్నం బాలరాజు, మహిపాల్ రెడ్డి, నందిగామ మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఎస్బీపల్లి మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, మంకాల శ్రీశైలం పాల్గొన్నారు. 

Similar News