శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మల్ రెడ్డి

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ వేడుకలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Update: 2024-05-22 16:11 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ వేడుకలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. ఆలయ స్థలంలో కంచ ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణతో పాటు

    ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా చేయడానికి తల వంతు సహాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భూపతి గాల్ల మైపాల్, రాష్ట్ర నాయకులు కొత్త కుర్మ శివకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ ఏదుళ్ల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమ్మలపల్లి గురునాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాయిని సత్యనారాయణ, ఆకుల యాదగిరి, ఈగల రాములు, తాళ్లపల్లి కృష్ణ, నల్లబోలు మమతా శ్రీనివాస్ రెడ్డి, తాళ్ల మహేష్ గౌడ్, దేవాదాయ శాఖ ఈఓ మురళీకృష్ణ, ఆలయ సేవకులు సురమోని బాబు, తంబాల కృష్ణ, పూజారులు తదితరులు పాల్గొన్నారు. 

Similar News