తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేపటి నుండి ప్రచారం చేపట్టనున్నారు.

Update: 2023-11-21 15:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేపటి నుండి ప్రచారం చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొని ప్రసగించనున్నట్టు ఆ పార్టీ కార్యదర్శి పి.హరి ప్రసాద్ తెలిపారు. బుధవారం వరంగల్ పట్టణంలో ఉర్సు గుట్ట వద్ద మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. అలాగే కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రచారం నిర్వహిస్తారని ప్రసాద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News