కేసీఆర్‌పై యుద్ధం చేస్తానని కత్తి తీసి.. కాళ్ల దగ్గర పెట్టావ్: ఆర్ఎస్పీపై వంశీకృష్ణ ఫైర్

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్‌పై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో

Update: 2024-05-26 10:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్‌పై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్‌పై యుద్ధం చేస్తానని కత్తి తీసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు కత్తి దాచిపెట్టి బీఆర్ఎస్‌లో చేరి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడని ఎద్దేవా చేశారు. ఇక, గుండాగిరికి కేరాఫ్ అడ్రస్ అని గూగుల్‌లో కొడితే గువ్వల బాలరాజు అని వస్తుందని సెటైర్ వేశారు. అక్రమ కేసులు పెట్టించడంలో ఆయనకు ఆయనే దిట్ట అని అన్నారు. గతపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్‌లో కమాండింగ్ చైన్ తెగిపోయిందని, ఎమ్మెల్యే ఏం చెప్తే సీఐ, ఎస్ఐలు అదే చేశారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తోందన్న తప్పుడు ఆరోపణలు చేస్తోన్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్‌కు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్చిపోయి ఉంటాడని.. గతంలో బాలరాజు నిన్నుకుడా బెదిరించాడని గుర్తు చేశారు. నయిమ్‌తో సంబంధాలు ఉన్నది మాకు కాదని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకేనని అన్నారు. త్వరలోనే గువ్వల బాలరాజు చిట్టా అంతా విప్పుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. నయిమ్ డైరీ బయట పెట్టాలని సీఎంని కోరుతానని, దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు. నయిమ్ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎక్కడ పోయాయి.. వాటి అన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తానన్నారు. నయిమ్ ఆస్తులు.. కేసీఆర్, కేటీఆర్‌కి ఎంత ఎంత వెళ్లాయి అనేది తేలాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Similar News