ఐఏఎస్ కావాలనేదే ఆకాంక్ష

ఐఏఎస్ అవ్వాలన్న ఆకాంక్షతోనే... చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతున్నానని, అందువల్లే తాను స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించానని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థిని వలకొండ చర్విత అన్నారు.

Update: 2024-04-24 13:22 GMT

దిశ, భిక్కనూరు : ఐఏఎస్ అవ్వాలన్న ఆకాంక్షతోనే... చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతున్నానని, అందువల్లే తాను స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించానని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థిని వలకొండ చర్విత అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతపల్లి గ్రామానికి చెందిన చర్విత ఎంపీసీ మొదటి సంవత్సరం,

     హైదరాబాదులోని ఓ ప్రైవేట్​ కాలేజీ లో మొదటి సంవత్సరం చదువుతుంది. 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆమె తండ్రి అంతంపల్లి సొసైటీ చైర్మన్ వలకొండ వెంకటరెడ్డిని, కూతురు చర్వితను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె దిశ తో మాట్లాడుతూ ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష తోనే కష్టపడి చదువుతున్నానని, అందుకు తమ పేరెంట్స్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించింది. 


Similar News