దిశ ఎఫెక్ట్​....సీడ్ బ్యాగులను పరిశీలించిన ఏఓ

దిశ దినపత్రికలో మంగళవారం వచ్చిన నకిలీ విత్తనాలతో రైతన్నలకు పరేషాన్ అనే శీర్షికపై స్పందన లభించింది.

Update: 2024-05-24 12:54 GMT

దిశ, కోటగిరి : దిశ దినపత్రికలో మంగళవారం వచ్చిన నకిలీ విత్తనాలతో రైతన్నలకు పరేషాన్ అనే శీర్షికపై స్పందన లభించింది. ఉమ్మడి కోటగిరి మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి వరి విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి మోసం చేయాలని చూస్తే చట్టపరమైన చర్యలతో పాటు దుకాణాల లైసెన్స్ ను రద్దు చేస్తామని ఆయన అన్నారు. 

Similar News