పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్

పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.

Update: 2022-12-06 15:07 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమిక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఐదు పురపాలికలలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా, పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని అన్నారు. సమగ్ర నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామాలు, 100 శాతం మంచినీటి సరఫరా, బిల్డింగ్ పర్మిషన్ల అమలు, డంపింగ్ యార్ల్డ నిర్వహణ, బయో మైనింగ్ ప్రాసెస్, హరితహారం, మోడరన్ ధోబి ఘాట్ నిర్మాణం, మొదలగు కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పట్టణాలలోని అంగన్వాడీ సెంటర్లను సుందరీకరణ చేయాలని కోరారు. మున్సిపాలిటీల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News