హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సారా నిర్మూలనకై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

Update: 2024-04-29 15:24 GMT

దిశ, హుజుర్ నగర్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సారా నిర్మూలనకై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకొని 9 వాహనాలు సీజ్ చేసి 12 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందని వీటి విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చింతలపాలెం మండలం పీక్లా నాయక్ తండా కు చెందిన గ్రామానికి చెందిన లావుడ్యా బుజ్జి తన ట్రాక్టర్ లో 5 బస్తాల పటికను 250 కిలో లు కొత్త తండా లో సప్లయ్ చేస్తుండగా ట్రాక్టర్ &ట్రాలీ పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మఠంపల్లి మండలం కొత్త తండాకు చెందిన బాణోత్ ఎలమంద 100 కిలోల పటికను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. అలాగే బుధవడా కు చెందిన గుగులోతు రమేష్ 150 కిలో ల పటికను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు .పాలకవీడు మండలంలోని బెట్టే తండా కు చెందిన అశోక్ అనే వ్యక్తి 10 లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని అలాగే ముగ్గురు వ్యక్తులు చత్రు, అశోక్, గణేష్ తమ బజాజ్ ఆటో లో 250 కిలో ల పటికను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

దోనబండ కు చెందిన మాలోతు సైదా 6 లీటర్ల సారా తరలిస్తుండగా అతని టీవీస్ పట్టుకున్నామన్నారు.శివ బాలాజీ తండా కు చెందిన బానోతు సైదా 10 లీటర్ల సారా తరలిస్తుండగా అతని హీరో హోండాను పట్టుకొని ఆ వ్యక్తిపై కేసులు నమోదు చేసి పట్టుబడిన వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.చింతలపాలెం మండలంలోని దొండపాడులో తనిఖీలలో 100 కిలోల పటికను వాహనంతో స్వాధీనం చేసుకోవడమైనది. వ్యక్తి పరారీ లో ఉన్నాడని తెలిపారు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామానికి చెందిన ధర్మేంద్ర తన రేనాల్డ్ క్విడ్ కారులో మద్యం ఉంచి ఆంధ్ర కు తరలించే ప్రయత్నంలో ఉండగా ఆ వ్యక్తి నుండి 105 సీసాలను పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.పలు కేసులలో ఉన్న సుమారు 15 మంది తహసీల్దార్ ల ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్సైలు జగన్మోహన్ రెడ్డి దివ్య వెన్నెల గోవర్ధన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News