రెస్టారెంట్ లోని దొంగతనం కేసును చేధించిన పోలీసులు

మఠంపల్లి మండల కేంద్రంలోని సన్స్ రెస్టారెంట్ లో ఈనెల 9న రాత్రి సమయంలో రెస్టారెంట్ కౌంటర్లో ఉన్న రెండు లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన నిందితుడిని

Update: 2024-05-16 15:22 GMT

దిశ హుజూర్ నగర్ (మఠంపల్లి) : మఠంపల్లి మండల కేంద్రంలోని సన్స్ రెస్టారెంట్ లో ఈనెల 9న రాత్రి సమయంలో రెస్టారెంట్ కౌంటర్లో ఉన్న రెండు లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన నిందితుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకొని అతని వద్ద ఉన్న నగదు స్వాధీనపరుచుకొని అతనిపై కేసు నమోదు చేసి కోర్టు డిమాండ్ చేసిన సంఘటన గురువారం జరిగింది. మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మఠంపల్లి మండల కేంద్రంలోని సన్స్ రెస్టారెంట్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న దేశబోయిన సంధ్య ఆ రెస్టారెంట్ కౌంటర్లో 2 లక్షల రూపాయలను ఉంచి తాళం వేసుకొని ఇంటికి వెళ్ళింది.

అదే రోజు రాత్రి సమయంలో రెస్టారెంట్ లోకి ప్రవేశించి తాళాలు పగులగొట్టి 2 లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించకపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే గురువారం ఉదయం మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామం వద్ద ఉన్న వై జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో నిందితుడైన మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ప్రస్తుతం మట్టపల్లిలో ఉంటున్న రామవాత్ సైదులు @ బానోతు సైదులు తండ్రి గిండా @ రాముడు అనుమానంతో పట్టుకొని అతని విచారణ చేయగా ఆ నేరాన్ని తనే చేశానని ఒప్పుకున్నట్లు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో రెస్టారెంట్లకు ప్రవేశించి ఆ కౌంటర్ ను ఇనుపరాడు స్క్రూ డ్రైవర్ తో పగలగొట్టి అందులో ఉన్న రెండు లక్షల రూపాయలను దొంగలించుకుని వెళ్లినట్లు తెలిపారు.నిందితులు వద్ద రెండు లక్షల గాను 16 వేల రూపాయలను తన విలాసాలకు వాడుకున్నాడని మిగిలిన ఒక లక్ష 84 వేల రూపాయలను నేరస్తును వద్ద స్వాధీనపరచుకొని కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. ఈ నేరస్తుడు గతంలో మోటార్ సైకిల్ దొంగతనాలను చేసి హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ లో 22 కేసులలో ఉండడం వలన అతన్ని హైదరాబాదులోని చర్లపల్లి జైలులో 3 సంవత్సరములు జైలు చేశాడని తెలిపారు. గత 7 నెలల క్రితం జైలు నుండి వచ్చి మట్టపల్లి నందు ఉంటూ ఈ నేరానికి పాల్పడుతున్నారని తెలిపారు.

Similar News