ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ ఉద్యోగి

విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలంలోని మల్లారెడ్డి గ్రామంలో రవి సూర్యనారాయణ

Update: 2024-05-16 15:08 GMT

దిశ, చింతపల్లి : విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలంలోని మల్లారెడ్డి గ్రామంలో రవి సూర్యనారాయణ అనే రైతు వ్యవసాయ, ఇంటి విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభాలు కావాలని రెండు సంవత్సరాల నుంచి విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగి స్తంభాలు కావాలంటే 50,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే అధికారి రైతు మధ్య ఒప్పందం మొదలు రూ.20,000 పని పూర్తయిన తర్వాత మిగతా 30,000 ఇచ్చేటట్లు ఖరారు చేసుకున్నారు. ఉద్యోగి వేధింపులకు తట్టుకోలేక సదరు రైతులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈరోజు రైతు నుంచి విద్యుత్ ఉద్యోగి రూ.20,000 లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుబడ్డారు.

Similar News