ఆ వ్యాపారం చేస్తున్న భార్యాభర్తలు.. సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు  

Update: 2022-02-05 14:04 GMT

దిశ, నల్లగొండ: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అదనపు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గుట్కా వ్యాపారం చేసే వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేసి  రిమాండ్ తరలించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నార్కట్పల్లికి చెందిన రామకృష్ణ, అతడి భార్య నాగలక్ష్మి అదనపు డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నిషేధిత గుట్కాను ఇంట్లో నిల్వ ఉంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారని  నార్కట్ పల్లి పోలీసులకు ఈనెల 2న సమాచారం అందింది.

దాంతో పోలీసులు వారి ఇంటికి వెళ్లగా భార్యాభర్తలు ఇద్దరూ పరారయ్యారని  తెలిపారు. వెంటనే  ఇంట్లోకి వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించగా 35 బస్తాల గుట్కా ప్యాకెట్లు,14 ఎస్సార్ ప్యాకెట్లు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.80వేలు ఉంటుందని చెప్పారు.రామకృష్ణ  రామన్న పేటకు చెందిన యాద శివ వద్ద  గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని  పేర్కొన్నారు. దంపతులను అరెస్టు చేసి  రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై  గతంలో గుట్కా రవాణా  కేసు నమోదైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, చిట్యాల సీఐ శంకర్రెడ్డి, నార్కట్ పల్లి ఎస్ఐ రామకృష్ణ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News