కేసీఆర్ ను జైలుకు పంపకపోతే పేరు మార్చుకుంటా : కోమటిరెడ్డి

కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపకపోతే నా పేరు మార్చుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-06 15:00 GMT

దిశ ,ఎం,తుర్కపల్లి : కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపకపోతే నా పేరు మార్చుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అరాచకాలు వేల కోట్ల స్కాంలు ప్రజలకు తెలిసి కేసీఆర్ కుటుంబాన్ని గద్దెను దించారని తెలిపారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడం ఖాయమని కాంగ్రెస్ పార్టీని ఎవరూ కూడా టచ్ చేయలేరని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటామని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీ గెలిపించాలని అన్నారు. ఆయన వెంట ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, మండల నాయకులు కాంగ్రెస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News