ప్రభుత్వ ఆసుపత్రిలో.. చనిపోయి ఒకరోజు గడిచినా పోస్టుమార్టం అవ్వని మృతదేహం

పేదవాడికి ఆరోగ్యం బాగలేకపోతే ముందుగా పోయేది ప్రభుత్వ ఆసుపత్రికి అలాంటి ఆసుపత్రి అయిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర సంఘటన జరిగింది..

Update: 2023-02-06 07:45 GMT

దిశ, నల్లగొండ: పేదవాడికి ఆరోగ్యం బాగలేకపోతే ముందుగా పోయేది ప్రభుత్వ ఆసుపత్రికి అలాంటి ఆసుపత్రి అయిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర సంఘటన జరిగింది. వ్యవసాయ కూలి వాడపల్లి శంకరయ్య బ్రతుకుదేరువు కోసం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన స్వంత గ్రామం ఎల్లమోని గూడెం గుర్రంపోడు మండలం అప్పులు, ఆర్థిక పరిస్థితిలను తట్టుకోలేక పురుగుల మందుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనని తక్షణం జనవరి 23వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి నల్లగొండలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషాలకు మరణించాడు. అసలే నిరుపేద కుటుంబం వారి కుటుంబ సభ్యుల రోదన మిన్నంటాయి. వారికి ఆయన మృతదేహం అదేరోజు అందించాలి.

కానీ, ఒక రోజు ఆగాల్సిందే అని ఉదయం 9 గంటలకు మార్చురీ ఓపెన్ చేసిన ఇంకా వారి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయలేదు. ఒక రోజు గడుస్తున్నా వారికి అందించలేదని స్పష్ఠంగా తెలుస్తుంది. ఇది పూర్తిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అని తెలుస్తుంది. ఈ ఒక్క సమస్య నే కాదు ఈ ఆసుపత్రి కి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ప్రభుత్వం అందరికి నాణ్యమైన వైద్యం అందించి వారికి సేవలు అందించాలని చెప్తున్నా ఈ లాంటి విషాదమైన ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టనట్లు ఉండటం.. గతంలో కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారులోనే ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చిన సంఘటన మరువక ముందే మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆసుపత్రి ఎలాంటి అసమర్థ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు కోరుతున్నారు.

Similar News