KTRకు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్ విసిరారు.

Update: 2023-10-04 12:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్ విసిరారు. ప్రజల కోసం కరెంట్ తీగలు పట్టుకోవడానికి సిద్ధమన్నారు. లాగ్ బుక్‌లు తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని నిరూపించాలన్నారు. ఆలేరులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు అన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే అన్నారు. సోనియా ప్రకటించిన గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మరో రెండు రోజుల్లో టికెట్లు కన్ఫామ్ అయ్యాక యాదగిరి గుట్ట నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు కాకపోతే తాను పదవులకు రాజీనామా చేస్తానన్నారు.

Tags:    

Similar News