నిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదకర స్థితిలో చెట్టు! క్యాంటీన్, పార్కింగ్ ప్లేస్‌లో కూలిపోయే దిశలో..

ఇటీవల చికిత్స కోసం వస్తే ఓ చెట్టుకూలి వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసిందే. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు పేషంట్లపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-05-23 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చికిత్స కోసం వస్తే ఓ చెట్టుకూలి వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసిందే. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు పేషంట్లపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో వ్యక్తి మృతి చెందాడు. అతని భార్యకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంబంధించిన సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం అయింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌ ఆవరణలో ఓ చెట్టు ప్రమాదకర స్థితిలో ఉందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. పూర్తిగా చెదలు పట్టి ఏ క్షణం అయినా చెట్టు కూలడానికి సిద్ధంగా ఉందని, నిమ్స్ ఆస్పత్రిలో అన్నపూర్ణ క్యాంటీన్ పక్కన, బైక్ పార్కింగ్ స్టాండ్ దగ్గర ఆ చెట్టు ఉందని, చర్యలు తీసుకోవాలని నెటిజన్ నగర మేయర్, జీహెచ్ఎంసీ అధికారులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. కాగా, వర్షాకాలంలో ఈదురు గాలులకు సిటీలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం అందరూ చూసే ఉంటారు. రాబోయేది వర్షాకాలం కావడంతో సిటీలో ఇలా కూలిపోయే దశలో ఉన్న చెట్లను గుర్తించి.. ప్రమాదాలు జరగకముందే ముందస్తుగానే అలాంటి చెట్లు కొట్టివేయడం బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Click Here For Twitter Post..

Tags:    

Similar News