BREAKING: హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర జరుగుతోంది: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాతం(యూటీ)గా చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-23 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాతం(యూటీ)గా చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2తో ముగుస్తోందని తెలిపారు. ఈ క్రమంలో కొందరు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సంక్లిష్ట సమమంలో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హరీష్ రావు కోరారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేసేందుకు లోక్‌సభలో బీజేపీ బిల్లు పెడితే.. ఆ బిల్లుకు మద్దతు తెలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ వశం అయితే.. కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.      

Tags:    

Similar News