పొలిటికల్ మైలేజీ కోసం చిల్లర నిందలా? సీఎం మమతా బెనర్జీపై బండి సంజయ్ విమర్శలు

సీఎం మమతా బెనర్జీపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Update: 2024-05-23 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పేదలకు సేవ చేస్తున్న రామకృష్ణ మిషన్, ఇస్కాన్, భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. పొలిటికల్ మైలేజీ కోసం కీర్తి ప్రతిష్టలు ఉన్న సంస్థలపై చిల్లర నిందలు వేయడం ముఖ్యమంత్రి పదవికి తగదన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ రియాక్ట్ అవుతూ మమతా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఆరంబాగ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఘోఘాట్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నేతల ప్రభావంతో పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వారు దేవాలయాలను చూసుకునే వారు గొప్ప ఆధ్యాత్మిక ఉద్యోగులు. కానీ కొందరి ప్రమేయంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలపై సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మమతా బెనర్జీ వెనక్కి తగ్గారు. నేను ఏ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రామకృష్ణ మిషన్ కు నేను వ్యతిరేకం కాదు. కానీ కొంతమంది వ్యక్తులపైనే నేను మాట్లాడానన్నారు. వారు మతం ముసుగులో బీజేపీ కోసం పని చేస్తున్నారు. అలాంటి వారు రాజకీయాల కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వారికి అన్ని హక్కులు ఉన్నాయి. అయితే బాహాటంగా కమలం పార్టీలో చేరాలి తప్ప ముసుగేసుకుని ఒకరికి వంత పాడవద్దని సూచించారు. 

Click Here For Twitter Post..

Tags:    

Similar News