ఐఐటీ ర్యాంకర్ తనుషకు ఆర్థిక సహాయం
పేదరికం వెన్నంటి నడుస్తున్న చదువులో మాత్రం ఏనాడు వెనుకడుగు వేయలేదు వెంకటాపురానికి చెందిన డి.ఎల్. తనుష.
దిశ, అల్వల్: పేదరికం వెన్నంటి నడుస్తున్న చదువులో మాత్రం ఏనాడు వెనుకడుగు వేయలేదు వెంకటాపురానికి చెందిన డి.ఎల్. తనుష. తండ్రి మృతి చెందడంతో తల్లి ఇండ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని అతి కష్టం మీద నెట్టుకొస్తోంది. అయినా అవేమి తనుషాను కృంగదీయకపోగా మరింత పట్టుదలను పెంచాయి. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే ఐఐటీ పరిక్షలో 2401వ ర్యాంక్ సాధించి ముంబాయిలో ఉచిత సీటు సంపాదించింది. ఈ సందర్భంగా వెంకటాపురం ప్రాంతానికి చెందిన మేడ వెంకట సురేష్ కుమార్ తనుష విద్యాబ్యాసానికి గాను రూ.1016 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. సీటు ఉచితం అయినప్పటికి ముంబాయిలో చదవడం అంత సులభమేమి కాదు. కనుక దాతలు ఆర్థిక సహాయం చేసి తనుష చదువు ఆగిపోకుండా చూడాలని కోరారు. దాతలు ప్రత్యక్షంగా కలిసి గాని, బ్యాంక్ అకౌంట్‌కి గాని చేయవచ్చన్నారు. ఎస్బీఐ బ్యాంక్ వెంకటాపురం బ్రాంచి అకౌంట్ నంబర్ 41205374876 అండ్ ఐఫ్ఎస్సి కోడ్: SBIN0020166. ఫోన్ నెంబర్: 7396051221లో సంప్రదించి మీ వంతు సహాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్థిక సహాయం చేసినవారికి తనుష కృజ్ఞతలు తెలిపారు.