మూడు నెలల్లో కళ్ళు నెత్తికెక్కాయి : ఈటల

ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ

Update: 2024-03-28 12:24 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల పై ఒత్తిడి పెడతామని, అందులో నేను ముందు ఉంటానని మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన పలు సమావేశాలలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కటానికి ఐదేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డికి మూడు నెలల లోపే కళ్ళు నెత్తికెక్కాయి అని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి ప్రజలకు మధ్య ఉన్న కనెక్టివిటీ పోయిందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ ఎస్ పార్టీకి ఓటు వేయడం అసంబద్ధమని తెలిపారు.

మంత్రి పదవి చేపట్టకుండానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి పథకాల అమలు చేస్తానని చెబుతున్నాడని ఆయనకు నిధులు ఏ విధంగా తేవాలో తెలియదని పేర్కొన్నారు. మంత్రికి పనిచేసిన తనకు ఎక్కడ నుంచి ఏ సందర్భాలలో నిధులు వస్తాయో పూర్తి అవగాహన ఉన్నదని కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తేవాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవబోతుండదని అందులో మల్కాజ్గిరి పార్లమెంటు ఉండేందుకు మీరందరూ ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Similar News