కాప్రాలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

కాప్రా సర్కిల్ పరిధిలో గురువారం బీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.

Update: 2024-05-09 12:44 GMT

దిశ, కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలో గురువారం బీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఉదయం కాప్రా సాయిబాబా నగర్ శ్రీ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మల్కాజిగిరి నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, సాయిబాబా నగర్ నుండి భారీ ర్యాలీ పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీ ఏఎస్ రావు నగర్, చర్లపల్లి మీదుగా కుషాయిగూడ ప్రధాన రహదారిమీదుగా సాగింది. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఎన్నికల ఇంఛార్జి మహమ్మద్ జహంగీర్ పాషా , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డి లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    కాప్రా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వార్డులోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ కర పత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఐదు నెలల్లోనే 10 ఏండ్లు వెనుకకు నెట్టి వేయబడ్డదని, మళ్లీ పునర్నిర్మాణం జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను చట్ట సభల్లో నిలపాలన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

Similar News