6న తిరుపతమ్మ తల్లి కళ్యాణోత్సవం

ముసలిమడుగు క్రాస్ రోడ్డులో గల తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని 6న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2023-02-03 11:38 GMT

దిశ, బూర్గంపాడు: ముసలిమడుగు క్రాస్ రోడ్డులో గల తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని 6న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు. అమ్మవారి దేవాలయం ప్రధాన దీక్షా గురుస్వామి కంచేటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News