MLC ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-05-02 06:45 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు విధించారు. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు చివరి తేదీ గా నిర్ణయించారు. మే 27న వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేస్తారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో నల్గొండ జిల్లా కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ములుగు జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Similar News