బీఆర్ఎస్ కు భారీ షాక్...కాంగ్రెస్ గూటికి కూసుమంచి ఎంపీపీ

మండలంలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.

Update: 2024-05-02 13:47 GMT

దిశ, కూసుమంచి : మండలంలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఈయనకి కండువా కప్పి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ పార్టీ కార్యాలయంలో ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ తో పాటు పలువురు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ విధానాలు,

    పై నాయకుల పోకడలు నచ్చక తాము బయటకు వచ్చినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు అన్నారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు చాట్ల పరుశురాం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బానోత్ రామ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ లు ములకూరి శ్యామ్ సుందర్ రెడ్డి, బానోత్ నాగేశ్వరావు, బానోత్ మమత, బాధవత్ బీబ్లీ, ఎంపీటీసీ బాధవత్ మంగ్యా, జహంగీర్ షరీఫ్, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి, నాయకులు బాధవత్ శంకర్, మంగీత్య, శ్రీను, కందిబండ శ్రీధర్, చిలకబత్తిన నాగరాజు, బానోత్ కిషన్ తదితరులు ఉన్నారు.

Similar News