విద్యార్ధినులకు కరాటే శిక్షణ

విద్యార్ధినుల ఆత్మరక్షణకు కరాటే శిక్షణను కారేపల్లి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ప్రారంభింఛారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని...Karate training for students

Update: 2023-01-24 14:48 GMT

దిశ, కారేపల్లి: విద్యార్ధినుల ఆత్మరక్షణకు కరాటే శిక్షణను కారేపల్లి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ప్రారంభింఛారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యాలయ స్పెషల్‌ ఆఫీసర్‌ జీ.ఝాన్సీ సౌజన్య, మాస్టర్‌ క్లింటోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ కరాటేతో ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం మెండు అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఆడ, మగ లింగభేదం లేకుండా సమానంగా చూడాలన్నారు. నేటి సమాజంలో ఆడపిల్లకు విద్య ఎంతో అవసరమని పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారన్నారు. విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా విద్యాలయంలో విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. విద్యార్ధునులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్‌డీ. నూర్జహాన్‌, మల్లెంపాటి విజయలక్ష్మి, కవిత, చీకటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


Similar News