కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గడపగడప కు బీజేపీ

దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గడప గడప కు బీజేపీని తీసుకెళ్లడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ పిలుపునిచ్చారు.

Update: 2023-06-01 14:47 GMT

దిశ, ఖమ్మం టౌన్ : దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గడప గడప కు బీజేపీని తీసుకెళ్లడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో ఓ హోటల్ లో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంకు హాజరైన ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ నుండి ఖమ్మం వచ్చానని రెండు రోజుల పాటు జిల్లా లో ఉంటానని, జమ్ము కాశ్మీర్ నుండి ప్రేమను తీసుకొని వచ్చానన్నారు. జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఇప్పుడు లేదని, ఇప్పుడు కోటి మంది టూరిస్టులు కాశ్మీర్ కు వస్తున్నారని, ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కశ్మీర్ వాతావరణం తెలంగాణ వాతావరణం ఒకేరకంగానే ఉందని, పాలన మాత్రం తెలంగాణ లో వేరుగా ఉందన్నారు.

    మోడీ సర్కార్ 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కానీ రెండు ప్రభుత్వాల పరిపాలన చూస్కుంటే చాలా తేడా ఉందని అన్నారు. తెలంగాణ లో 12 వేల కోట్ల రూపాయలతో హైవే రోడ్డులను డెవలప్ కోసం కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ కింద ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్నింటికీ పేరు మార్చి కేసీఆర్ వారి పేర్లు తీసుకొస్తున్నాడని, ఇప్పుడు కొత్తగా దళిత బంధు ని తెచ్చి ఎం ఎల్ ఏ లకు అప్పగించి కమిషన్లు నొక్కుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, పేపర్ లీకేజీ లు చేసి సొమ్ము చేసుకొని ఎక్కడ దొరుకుతామో అని ముందుగా బీజేపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.

     కేసీఆర్ కు ప్రజలు తప్పని సరిగా బుద్ది చెప్తారన్నారు. కళ్యాణ్ యోజన పథకం కులమతాలకు అతీతంగా ఇవ్వడం జరిగుతుందన్నారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు పుష్కలంగా ఉన్నాయని, పాలకుల నిర్లక్ష్యంతో అవి అందడం లేదన్నారు. దేశంలో మూడు కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చాముని పేర్కొన్నారు. తమిళనాడు సహ ఇంచార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 30 వరకు ఇంటింటికి బీజేపీ, గడపగడపకు కమలం గుర్తును తీసుకుపోతున్నామని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం 909090204 నంబర్​కు మిస్డ్​ కాల్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా ఇంచార్జి రమేష్, గెంటేల విద్యాసాగర్, ఉప్పల శారదా, నున్నా రవికుమార్, రామలింగేశ్వర్రావు, శ్యామ్ రాథోడ్, శ్యామ్, ఉపేందర్ గౌడ్, రుద్ర ప్రదీప్ ఉన్నారు.


Similar News