బిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలి

భారత దేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి, మన ప్రతిష్టను ప్రపంచానికి చాటిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలిండియా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 42 రోజులకు పైగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం నిర్వహిస్తున్నారు.

Update: 2023-06-06 11:17 GMT

దిశ,ఇల్లందు : భారత దేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి, మన ప్రతిష్టను ప్రపంచానికి చాటిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలిండియా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 42 రోజులకు పైగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం నిర్వహిస్తున్నారు. మే 28వ తేదీన ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ముందు రేజ్లర్లు నిర్వహించిన మహా పంచాయితీ నిరనసను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు అత్యంత పాశవికంగా దాడి, లాఠీ చార్జి చేసి పోరాడుతున్న మహిళా క్రీడాకారుల పైనే కేసులు బనాయించారు.

    జంతర్ మంతర్ వద్ద ధర్నా శిబిరాలను దారుణంగా తొలగించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు అనుమతినివ్వ కుండా కేంద్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగిస్తున్నది. అయినా రెజ్లర్లు తమ పోరాటాన్ని పట్టుదలతో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేజ్లర్ల పోరాటానికి కార్మిక వర్గం అండగా నిలవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఈసం వెంకటమ్మ, జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహిళా క్రీడాకారుల పట్ల అనుసరిస్తున్న నిర్బంధాన్ని నిరసిస్తూ మండల వ్యాప్తంగా అన్ని యూనియన్ల నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమానికి కల్లేపల్లి మరియ అధ్యక్షత వహించగా చాట్ల రాంబాయి, ఆలేటి సంధ్య, యాకమ్మ,వెంకటమ్మ, కళ, సీహెచ్. రమణి, నాగమణి, పద్మ ఉమా, మాధవి, జయలక్ష్మి, పద్మ, ఉమాబాయి పాల్గొన్నారు.


Similar News