Independence Day In Khammam: ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగస్టు 15 వేడుకలు

Bar Association Celebrates Independence Day In Khammam| సోమవారం ఖమ్మం జిల్లా కోర్టులో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు

Update: 2022-08-15 09:10 GMT

దిశ, లీగల్ ఖమ్మం: Bar Association Celebrates Independence Day In Khammam| సోమవారం ఖమ్మం జిల్లా కోర్టులో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశభక్తి అంటే ఏంటో చిన్న కథగా.. విమానంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకరు సెలబ్రిటీ, మరోకరు వికలాంగుడైన సైనికుడు అని. అయితే ఈ ఇరువురు ప్రక్కప్రక్కనే సీట్లో కూర్చున్నారు. కానీ సెలబ్రిటీ ఆ సీటును మార్చమని కోరగా ఆ విమాన సిబ్బంది ఆ సైనికుడిని బిజినెస్ క్లాస్‌కు మారుస్తారు.

ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీ ఆ సిబ్బందిని అడగగా, ఆ సైనికుడే మాకు సెలబ్రిటీ అని వారు బదులిచ్చారు. ఈ స్వాతంత్ర్యం ఎంతమంది త్యాగదనుల కృషి ఫలితం అని అన్నారు. 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎం.ఎల్.సి తాతా మధు మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ, న్యాయవాదుల పరిరక్షణ చట్టంకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎన్.సంతోష్ కుమార్, జి.శ్రీనివాస్, మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, ఈ.బారతి, ఖమ్మం జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, బార్ కార్యవర్గం, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: జాతీయ జెండాను అవమానించిన ప్రైవేటు స్కూల్ డైరెక్టర్

Tags:    

Similar News