ఇళ్ల స్థలాలకు 210 దరఖాస్తులు

వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామంలో పేదలకు ఇండ్లస్థలాలు ఇచ్చే ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు.

Update: 2023-06-06 14:38 GMT

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామంలో పేదలకు ఇండ్లస్థలాలు ఇచ్చే ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఆ గ్రామంలో అందుబాటులో ఉన్న ఒకటిన్నర ఎకరాల అసైన్మెంట్ భూమిలో 50 మంది పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలిచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఆ స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అర్హులైన స్థానిక పేదలకు 75 గజాల స్థలానికి పట్టాలిచ్చేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ ఎన్. అరుణ ఇప్పటికే ప్రకటించారు.

     ఈనెల రెండో తేదీ నాటికి 210 మంది ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 9వ తేదీన ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తహసీల్దార్ ఎన్.అరుణ ప్రకటించారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో భాగంగా అభ్యంతరాల కోసం మంగళవారం సోమవరం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఇప్పటికే ఇండ్ల స్థలాలను సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్లు ఎం.వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, కౌన్సిలర్ దారెల్లి పవిత్రడుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News