తెలంగాణలో కొలువుల జాతర పెద్ద బూటకం: Marripalli Satyam

అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను మించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. రాష్ట్రంలో కొలువుల జాతర జరుగుతుంది అంటూ తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్ విమర్శించారు.

Update: 2022-12-05 14:07 GMT

దిశ, పెగడపెల్లి: అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను మించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. రాష్ట్రంలో కొలువుల జాతర జరుగుతుంది అంటూ తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల సంఖ్య తెలుసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో లక్ష 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని తేల్చితే.. మంత్రి కేటీఆర్ మాత్రం ఈ 9 ఏళ్ల వ్యవధిలో 2,25,000 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరియు హామీలు నెరవేర్చాలని, ఎన్నికలకు వెళ్ళడానికి ముందు త్వరలో నోటిఫికేషన్‌లు అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈసమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సంకిటి రవీందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్తూరి బాబు, మండల కార్యదర్శి వరద రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News