రేవంత్ రెడ్డి డబ్బుల సంచులు మోసిన కేసు దగ్గర్లోనే ఉంది : అరవింద్

రేవంత్ రెడ్డి డబ్బుల సంచులు మోసిన కేసు దగ్గర్లోనే ఉందని,

Update: 2024-05-02 10:44 GMT

దిశ, కోరుట్ల రూరల్/మల్లాపూర్ : రేవంత్ రెడ్డి డబ్బుల సంచులు మోసిన కేసు దగ్గర్లోనే ఉందని, జులై 14 రేవంత్ రెడ్డి కి డెడ్ లైన్ అని, భారతదేశంలో రామరాజ్య స్థాపన మొదలైందని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో,మల్లాపూర్ మండల కేంద్రము లో కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జులై 14 వ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బిసి రిజర్వేషన్లు రద్దుచేసి ఆర్థికంగా వెనుకబడిన ఏ వర్గానికి చెందిన వారి కైనా 10 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం మోడీ చేస్తున్నారని మైనార్టీలకు సైతం రిజర్వేషన్ వర్తింప చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాల ఉండి గుడ్లు మోసుడు ఎందని ఎద్దేవా చేశారు.

గూగుల్ లో గాడిద గుడ్డు పెడుతుందా అని వెతికితే రాహుల్ పెడుతాడు అని చూపిస్తుంది అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూపాయలు ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులకు అన్ని వర్గాల ప్రజలకు మోదీ అందజేస్తున్నారన్నారు. చక్కెర కర్మాగారా ప్రారంభానికి ఖర్చు ఎంత అవుతుందో అంతర్జాతీయ సంస్థలతో లెక్కలు వేయించాలని ఆ లెక్కలు వేయించిన నెల రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రజలను, మహిళలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేసి బలవంతపు చేరికలు చేస్తే కవిత ఎక్కడికి వెళ్లిందో రేవంత్ రెడ్డి అక్కడికే వెళ్తారన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో మోదీని ప్రధానమంత్రి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కమలం పువ్వుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలోబీజేపీ మండల అధ్యక్షుడు పంచిరి విజయ్,మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడీ శ్రీనివాస్,లవంగ శివ,బీజేపీ నాయకులు గుగ్గిళ్ల తుక్కారం, ద్యావనపల్లి శరత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News