అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్

ఈవీఎం యంత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 3 అంచెల

Update: 2024-05-16 14:21 GMT

దిశ, రామగిరి: ఈవీఎం యంత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, అధికారులు నిరంతరం స్ట్రాంగ్ రూమ్ లను పర్యవేక్షించాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ జేఎన్టీయూ కళాశాలలో జరుగుతుందని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ లోకి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వచ్చే వీలు లేదని, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూం లకు వేసిన సీల్ లను పరిశీలించి సంబంధిత రిజిష్టర్ లో సంతకం చేశారు. జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, కెమెరా మానిటరింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు వి.హనుమానాయక్, బి.గంగయ్య, తహసీల్దారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News