వియ్యంకుడి కోటాలో వచ్చిన నాన్ లోకల్ ని నమ్మొద్దు!.. తాండ్ర వినోద్ రావు హాట్ కామెంట్స్

కారు పని అయిపోయింది. హస్తం మనకు చెయ్యి ఇచ్చింది. వియ్యంకుడి కోటాలో వచ్చిన నాన్ లోకల్ ని నమ్మొద్దు అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు అన్నారు.

Update: 2024-04-29 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కారు పని అయిపోయింది. హస్తం మనకు చెయ్యి ఇచ్చింది. వియ్యంకుడి కోటాలో వచ్చిన నాన్ లోకల్ ని నమ్మొద్దు అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగుడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జన సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ప్రచారంలో భాగంగా తాను వెళ్లిన చోట ప్రజలు చూపించిన ఉత్సాహం, మీ దీవేనలు చూశాక ఖమ్మంలో కాషాయ జెండా ఎగరవేస్తామని నమ్మకం బలపడిందని తెలిపారు.

నేను ఈ ప్రాంత బిడ్డను, ముల్కలపల్లి గ్రామానికి చెందన వాడినని, వియ్యంకుడి కోటాలో వచ్చిన నాన్ లోకల్ ను నమ్మొద్దని సూచించారు. నేను పక్కా లోకల్ అని, ఇక్కడే పుట్టి, పెరిగి ఇక్కడి సమస్యలు తెలిసిన వాడినని, మన బాధలు బయటవాడికి తెలుస్తాయా? మనకి తెలుస్తాయా అని ప్రశ్నించారు. కారు పని అయిపోయిందని, హస్తం చేయి చూపించిందని, ఖమ్మం అభివృద్దికి మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ చేసిందని చెప్పారు. నేను ఇక్కడి నుంచి గెలిస్తే ఖమ్మం ప్రజల సమస్యలు మోడీ దగ్గరకి స్వయంగా తీసుకెళ్లి ఖమ్మం అభివృద్దికి దోహదపడతానని అన్నారు.

యదా రాజా తధా ప్రజా అన్నట్లుగా ఢిల్లీలో తల్లీకొడుకులు ఏలాలని చూస్తుంటే.. ఖమ్మంలో కాంగ్రెస్ కుటుంబాలే ఏలుతున్నాయని, ఓటు నోటు పెట్టి ఎవరినైనా కొంటారట, ఎవరినైనా గెలిపిస్తారట తస్మాత్ జాగ్రత్త! అని హెచ్చరించారు. ఖమ్మంలో చాలా అవకాశాలు సృష్టించవచ్చని, ఎన్ఎమ్ డీసీ వద్ద 600 ఎకరాలు ఖాళీగా ఉందని, అందులో ఐటీ పార్కులు, సెజ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు పెట్టుకొని ఖమ్మంను అభివృద్ది చేసుకోవచ్చని తెలియజేశారు. నరేంద్ర మోడీ, నడ్డా, ఇతర బీజేపీ నాయకుల ఆశీస్సులతో ఖమ్మంను అభివృద్ది చేసుకోవచ్చని, ఈసారి ఖమ్మంలో కమలం పువ్వు వికసించాలని విజ్ఞప్తి చేశారు.    

Similar News