MLA Purchase Case: : 'బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు'

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బండి సంజయ్ పేరు చెప్పాలని అధికారులు వేధిస్తున్నట్లు న్యాయవాది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు.

Update: 2022-11-29 07:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్నట్లు  సంచలన ఆరోపణలు చేశారు. మూడు రోజులుగా విచారణలో కేవలం బండి సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. సిట్ ఏర్పాటు చట్టవిరుద్ధమన్నారు. సీఆర్‌పీసీ 41 ఏ కింద తనకు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరైనట్లు తెలిపారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని, సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

సీవీ ఆనంద్, ఇద్దరు సిట్ సభ్యులు, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పోలీసు అధికారులు, రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను ప్రతి వాదులు చేర్చారు. ఈనెల 21, 22 తేదీల్లో విచారణకు హాజరుకాగా రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్ లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా ఒత్తిడి తెచ్చారన్నారు. అలా చెప్పని పక్షంలో కేసులో ఏ(7)గా చేర్చి మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఇదే విషయం సీవీ ఆనంద్ కు చెప్పిన పట్టించుకోలేదని నివేదించారు. విచారణ వీడియోను అధికారులు కోర్టుకు అందజేయలేదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. 

Read More: నాకే మద్దతు ఇవ్వండి....!! టీఆర్ఎస్ నాయకులతో రాత్రిపూట చర్చిస్తున్న బీజేపీ నేత

Read More: ఎంపీకి సిట్ మెయిల్.. విచారణకు రావాల్సిన అవసరం లేదు..

Similar News