అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి?.. అందులో ఎంత ఘోరం జరుగుతుందంటే?

రేవ్ పార్టీ.. ఈ పేరు వింటే సినీ, రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Update: 2024-05-27 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేవ్ పార్టీ.. ఈ పేరు వింటే సినీ, రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, రాజకీయ నాయకుల పిల్లలు లేకపోతే వారి బంధువుల పిల్లలు ఇందులో పాల్గొంటుండటంతో పట్టుబడిన క్షణాల్లోనే ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో కొనసాగుతున్న వారిని ఈ అంశం చిక్కుల్లో పడేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశాల్లో ప్రారంభమైన ఈ రేవ్ పార్టీ కల్చర్.. క్రమంగా ఇండియాకు పాకింది. ప్రస్తుతం ప్రతి వీకెండ్ దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల సమీపంలో ఉన్న ఫామ్‌హౌజ్‌లలో ఈ పార్టీలు కొనసాగుతున్నాయి. కొన్ని పట్టుబడుతుండగా.. మరికొన్ని రహస్యంగా జరిగిపోతున్నాయి. అయితే, అందరికీ ఈ రేవ్ పార్టీ అంటే తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో అవగాహన ఉండదు. కొందరు వీకెండ్‌లో పార్టీలు చేసుకోవడానికి ఫ్రెండ్స్‌తో ఫామ్‌హౌజ్‌లకు వెళ్లి చిల్ అవుతారు అనుకుంటారు.. మరికొందరు డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు.. కానీ అక్కడ జరిగేది వేరు.

వివరాల్లోకి వెళితే.. రేవ్ పార్టీలో డ్యాన్స్, డ్రగ్స్, మద్యం అన్నీ ఉంటాయి. ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే లోనికి ఎంట్రీ ఉంటుంది. చివరి నిమిషంలో కొత్త ఎంట్రీలు, చేంజెస్ వంటివి ఏం జరుగవు. ఉదాహరణకు వంది మందితో ఈ రేవ్ పార్టీ ప్లాన్ చేస్తే.. అందులో 25 శాతం మంది అబ్బాయిలు.. 75 శాతం మంది అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ వంద మంది గ్రూపులుగా విడిపోయి.. ముందుగా మద్యం సేవించడంతో స్టార్ట్ చేస్తారట. తర్వాత టీమ్‌ను లీడ్ చేసేవాడు.. ఫాంటసీస్ చెప్పి షురూ చేస్తారని సమాచారం. ఎవరూ ఫాంటసీలకు నో చెప్పడానికి వీలుండదు. రెగ్యులర్‌గా చేసే పనులు బోర్ కొట్టి డ్రగ్స్ తీసుకొని ఎవరికి నచ్చిన వారితో వారు ఎంజాయ్ చేస్తారట. భార్యను తృప్తి పరుచలేని భర్తలు.. ఈ పార్టీలకు భార్యలను తీసుకొచ్చి తృప్తి పరుస్తారని సమాచారం.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ.. అశ్లీల నృత్యాలు చేయటం, పరిధి దాటి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని.. అన్నింటికీ అన్ని రకాలుగా సిద్ధమయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బడాబాబుల ఫామ్ హౌసులలో, గెస్ట్ హౌసులలో ఈ పార్టీని నిర్వహిస్తుంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కంటిన్యూగా నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్‌, డ్రింక్స్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్‌ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక.. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే.. ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు మెనూలో పేర్కొంటారని తెలుస్తోంది. లోనికి వెళ్లాక ఎటువంటి ఇబ్బంది పడకుండా సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో పాటు ఫోన్లు కూడా బయటే ఇచ్చి వెళ్తారట. తాజాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పట్టుబడటంతో ఈ వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News