సివిల్ సప్లై శాఖపై ఆరోపణలు.. బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం

సివిల్ సప్లై శాఖలో అవినీతిపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-27 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సివిల్ సప్లై శాఖలో అవినీతిపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా ఆరోపణలు చేశారన్నారు. కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు దేనికి ఉత్తమ్ సమాధానం చెప్ప లేదని గుర్తు చేశారు. టెండర్లు పిలిచింది నిజమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్ల టెండర్లు దక్కించుకున్న వారు ధాన్యం కొనలేదని ఉత్తమ్ చెబుతున్నారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పదిహేను రోజుల క్రితమే అవినీతి గురించి ప్రశ్నించే సరికి వారు భయపడ్డారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో సబ్జెక్ట్ లేదని.. ఆయనకు ఆకారం పెరిగిందే కానీ ఆలోచన పెరగ లేదని సెటైర్లు వేశారు. సన్న బియ్యం గింజ కూడా తీసుకోలేదు అంటున్నారని.. అలాంటప్పుడు టెండర్లు ఎట్లా పిలిచారని ప్రశ్నించారు. రూ.57కే సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో రేటు నిర్ణయించింది నిజం కాదా అన్నారు. ప్రభుత్వమే అంత రేటు నిర్ణయిస్తే బహిరంగ మార్కెట్‌లో ధరల పరిస్థితి ఏమిటి ?ప్రజలపై భారం పడదా? అని క్వశ్చన్ చేశారు.

ధాన్యానికి రూ.2007 అని టెండర్లలో నిర్ణయిస్తే రూ.2230 ఏజెన్సీ‌లు రైస్ మిల్లర్ల దగ్గర వసూల్ చేయడం నిజం కాదా? అని ఆరోపించారు. యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఆదాయం పెంచుతున్నామని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎట్లా ఆదాయం పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి బాండ్ పేపర్లు రాయించుకోలేదా అన్నారు. సివిల్ సప్లైస్ టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేకపోతే టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. టెండర్ల ఆరోపణలపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మహేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కటే అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క సారి మాత్రమే సివిల్ సప్లైస్‌పై రివ్యూ చేశారని రిమైండ్ చేశారు. అన్ని శాఖలను మంత్రి శ్రీధర్ బాబు నడిపిస్తున్నారా..? అని ప్రశ్నించారు. బియ్యంతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. బియ్యం ధరను రూ.౫౭ పెంచాలని ఎవరు చెప్పారన్నారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు.

ధాన్యం, బియ్యం టెండర్లపై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవినీతిపై బీఆర్ఎస్న్యా య పోరాటం చేస్తుందన్నారు. సంవత్సరం కడుపు కట్టుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్కా ర్పొరేషన్ అవినీతిపై ఏం చెప్తారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఫాల్టర్స్‌ను జైలుకు పంపించామని.. ఆర్‌ఆర్ యాక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. సివిల్ సప్లైస్ అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఉత్తమ్కు మార్ రెడ్డి చేస్తున్నారన్నారు. టెండర్లపై తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Similar News