ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు..

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఇటలీ దేశంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా భయంతో ఎయిర్‌పోర్టులో అధికారులు విద్యార్థులను నిలిపివేశారు. సాయం కోసం ప్రముఖ న్యూస్ ఛానల్‌కు విద్యార్థులు వీడియో మెసేజ్ పంపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జెనావో ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, బెంగళూరు, నాగపూర్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. ఇటలీలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు పూర్తి చేసుకుని తిరిగి భారత్ బయల్దేరారు. దీంతో వారిని అడ్డుకుని మెడికల్ […]

Update: 2020-03-11 23:28 GMT

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఇటలీ దేశంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా భయంతో ఎయిర్‌పోర్టులో అధికారులు విద్యార్థులను నిలిపివేశారు. సాయం కోసం ప్రముఖ న్యూస్ ఛానల్‌కు విద్యార్థులు వీడియో మెసేజ్ పంపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జెనావో ఎయిర్‌పోర్టులో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, బెంగళూరు, నాగపూర్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. ఇటలీలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు పూర్తి చేసుకుని తిరిగి భారత్ బయల్దేరారు. దీంతో వారిని అడ్డుకుని మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను రక్షించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో తమకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

tags :Telangana students trapped in Italy, Genoa airport, nagpur, bangalore, kerala

Tags:    

Similar News