జీవో 46 రగడ! ఆర్ఎస్పీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఎటాక్!

గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కొత్త ప్రభుత్వం వరకు జీవో 46 రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Update: 2024-05-26 13:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కొత్త ప్రభుత్వం వరకు జీవో 46 రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జీవో 46 పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 46 ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నిరుద్యోగులకు మొండిచేయి చూపిందని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు విమర్శలు చేశారు. దీనిపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ట్వీట్ వేశారు.

ఏమంటున్నారో మీకూ అయినా అర్థం అవుతుందా సార్! జనాలు చూస్తే నవ్వి పోతారు. జీవో 46 తెచ్చింది ఎవరు, దాని పైనాపిల్ వేసేది ఎవరూ? చరిత్ర మరిచారేమో.. ఈ జీవో తెచ్చింది, నిరుద్యోగుల పైన రుద్దిందే మీ దొర ఆధ్వర్యంలోని పాత ప్రభుత్వం. మీరే జీవోలు ఇచ్చి, మీరే పిల్‌లు వేసి లబోదిబోమనడం తగునా! ఆ జీవో ఇచ్చినపుడు మీరందరూ తాగున్నారా లేక ఇప్పుడు ఓటమి జీర్ణించుకోలేక తాగి ఇలా చేస్తున్నారా? అని నిలదీశారు. మీరు ఎన్ని స్టంట్స్ వేసినా విద్యార్థులు, నిరుద్యోగులు మిమ్మల్ని మళ్ళీ నమ్మరు. ఎమ్ఎల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్‌లు మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయం.. అని విమర్శించారు.

ఈ ప్రజా ప్రభుత్వం తరఫున విద్యార్థి నిరుద్యోగులకు నాది హామీ! జీవో 46 సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. త్వరలోనే ఈ కమిటీ ద్వారా చట్టాలకు లోబడి, మీకు న్యాయం జరగబోతుంది.. అని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News