ఆ సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోండి!.. బీజేపీ నేతల ఫిర్యాదు

శోభాయాత్రలో అలజడి సృష్టించిన వ్యక్తితో బీజేపీకి, హనుమాన్ దీక్ష నిర్వాహకులకు ఎలాంటి సంబందం లేదని, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కరీంనగర్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

Update: 2024-05-26 12:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శోభాయాత్రలో అలజడి సృష్టించిన వ్యక్తితో బీజేపీకి, హనుమాన్ దీక్ష నిర్వాహకులకు ఎలాంటి సంబందం లేదని, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కరీంనగర్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లో శనివారం రాత్రి జరిగిన హనుమాన్ దీక్ష పరుల శోభాయాత్రలో ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించాలని కొన్ని అరాచక శక్తులు, నడుస్తున్న శోభాయాత్ర మధ్యలో దూరి దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. కత్తి తిప్పడం లాంటి పనులు చేసి శోభాయాత్రకు చెడ్డ పేరు వచ్చేట్టట్లు చేసారని, ఇట్లాంటి అరాచక శక్తులతో బిజెపి, హనుమాన్ దీక్ష నిర్వాహుకులకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అయితే కొన్ని ఫేక్ మీడియా సంస్థలు పని కట్టుకుని బీజేపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ఫేక్ మీడియా సంస్థలు జరిగిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి బీజేపిని బద్నామ్ చేసే విధంగా సోషల్ మీడియా, మీడియా ప్లాట్ఫార్మ్స్ లో విష ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో, బీజేపి నాయకులకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సంబంధం లేదని తెలుపుతూ.. బీజేపిపై విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కరీంనగర్ బీజేపి స్థానిక నాయకులు, పోలీస్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కరీంనగర్ కమీషనర్ ను బీజేపీ నేతలు కోరారు.







 


 


 



Similar News