ఫ్రీగా వస్తున్నాయా డబ్బులు.. ఎందుకు హెల్ప్ చేయాలి : Tamannaah

దిశ, సినిమా: కొవిడ్ టైమ్‌లో సాయం చేసేందుకు ముందుకు రావడం లేదంటూ సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని తప్పుపట్టింది మిల్కీ బ్యూటి తమన్నా భాటియా (Tamannaah). ఇది నటీనటులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుందని అభిప్రాయపడింది. ఎవరికి తోచిన విధంగా వారు హెల్ప్ చేస్తారని, కానీ కొందరికి ఇది చేశామని చెప్పుకోవడం ఇష్టముండదని తెలిపింది. తను కూడా అదే కేటగిరికి చెందిన వ్యక్తిని అన్న తమన్నా.. వైరస్ బారిన పడినవారికి సెలబ్రిటీలు హెల్ప్ చేయలేదనే భావన సరైందికాదని.. ప్రతీఒక్కరు […]

Update: 2021-05-31 02:10 GMT

దిశ, సినిమా: కొవిడ్ టైమ్‌లో సాయం చేసేందుకు ముందుకు రావడం లేదంటూ సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని తప్పుపట్టింది మిల్కీ బ్యూటి తమన్నా భాటియా (Tamannaah). ఇది నటీనటులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుందని అభిప్రాయపడింది. ఎవరికి తోచిన విధంగా వారు హెల్ప్ చేస్తారని, కానీ కొందరికి ఇది చేశామని చెప్పుకోవడం ఇష్టముండదని తెలిపింది. తను కూడా అదే కేటగిరికి చెందిన వ్యక్తిని అన్న తమన్నా.. వైరస్ బారిన పడినవారికి సెలబ్రిటీలు హెల్ప్ చేయలేదనే భావన సరైందికాదని.. ప్రతీఒక్కరు తమ వంతు కృషి చేశారని చెప్పింది. సాధారణ ప్రజలు సెలబ్రిటీలకు డబ్బు, అధికారం ఉందని అనుకుంటారు కానీ అది తప్పు. స్టార్స్ కూడా అందరిలాంటి మనుషులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరింది. తమకు ఫ్రీగా ఎవరూ డబ్బులు ఇవ్వరని, సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందన్న తమన్నా.. స్క్రీన్‌పై చూసే స్టార్స్‌కు రియల్ లైఫ్‌కు చాలా తేడా ఉంటుందని చెబుతోంది మిల్కీ బ్యూటీ.

Tags:    

Similar News