సన్‌ఫార్మా నుంచి తక్కువ ధరలో కరోనా ఔషధం!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ సన్‌ఫార్మా కొవిడ్-19 చికిత్స నివారణకు అతి చవకగా లభించే ఔషధాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకరోజుకు 50 వేల కొవిడ్-19 కేసులు నమోదవుతున్న సమయంలో సన్‌ఫార్మా చెప్పిన వార్త కొంత ఊరట కలిగిస్తోంది. ఫావిపిరవిర్ ఔషధం 200 మి.గ్రా ఫ్లూగార్డ్‌ను ప్రారంభించినట్టుగా సన్‌ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది. ఈ ఔషధం ఒక ట్యాబ్లెట్ ధర రూ. 35గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఎక్కువమంది బాధితులకు అతి చవకైన […]

Update: 2020-08-04 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ సన్‌ఫార్మా కొవిడ్-19 చికిత్స నివారణకు అతి చవకగా లభించే ఔషధాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకరోజుకు 50 వేల కొవిడ్-19 కేసులు నమోదవుతున్న సమయంలో సన్‌ఫార్మా చెప్పిన వార్త కొంత ఊరట కలిగిస్తోంది. ఫావిపిరవిర్ ఔషధం 200 మి.గ్రా ఫ్లూగార్డ్‌ను ప్రారంభించినట్టుగా సన్‌ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.

ఈ ఔషధం ఒక ట్యాబ్లెట్ ధర రూ. 35గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఎక్కువమంది బాధితులకు అతి చవకైన మందును అందుబాటులో ఉండేలా ఫ్లూగార్డ్ ఆవిష్కరించినట్లు సన్‌ఫార్మా ఇండియా సీఈవ్వో కీర్తి గనోర్కర్ పేర్కొన్నారు. దేశంలోని కరోనా బాధితులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించేందుకు ప్రభుత్వంతో పాటు ఇతర కంపెనీలతో కలిసి పనిచేయనున్నట్లు ఆ కంపెనీ వివరించింది. ఫ్లూగార్డ్‌ను ఈ వారంలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సన్‌ఫార్మా తెలిపింది.

Tags:    

Similar News