Breaking: కోనసీమ జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టివేత

ఎన్నికల వేళ భారీగా బంగారం, వెండి పట్టివేత కలకలం రేగింది....

Update: 2024-04-29 16:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ భారీగా బంగారం, వెండి పట్టివేత కలకలం రేగింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా భారీగా నగదు, బంగారం, వెండి, చీరలు, గిఫ్ట్స్, ప్రచార సామాగ్రిని తరలిందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్‌తో పాటు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా సరే అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా రూ. 6 కోట్ల 70 లక్షల విలువైన బంగారం, వెండిని ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు గుర్తించారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేశారు. లాజిస్టిక్ వాహనంలో 9 కిలోల 53 గ్రాముల బంగారం, 1,871 గ్రాముల వెండిని పట్టుకున్నారు. విజయవాడ వైపు నుంచి అమలాపురం వెళ్తుండగా బంగారం, వెండిని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు.

Similar News