ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..ఆ డబ్బులు రిలీజ్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చలు జరుగుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏపీలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఆ డబ్బుల జమకు ఈసీ అనుమతించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..పోలింగ్ ముగియడంతో వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈ నెల 14 నుంచే డబ్బులు అకౌంట్లలో వేసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. కానీ రెండు రోజులు గడిచిన ప్రభుత్వం 14 వేల కోట్ల నిధులను విడుదల చేయలేదు. ఈ డబ్బులను సోమవారం నుంచి రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.