చర్చకు సిద్ధమా.. సీఎం జగన్‌కు పెమ్మసాని సవాల్

మద్యం బ్రాండ్లపై సీఎం జగన్‌కు గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని సవాల్ విసిరారు..

Update: 2024-04-29 16:37 GMT

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం బ్రాండ్లన్నీ మారిపోయిన విషయం తెలిసిందే.  అయితే పాత బ్రాండ్లన్నీ తీసేశారు. ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లు వచ్చాయి. దీంతో ఈ బ్రాండ్లు తాగి చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఎన్నికల ప్రచార హస్త్రంగా మారింది. అంతేకాదు సవాళ్ల పర్వం వరకూ వెళ్లింది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రంలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెమ్మసాని కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకవని చెప్పారు. నాలుగు రకాల మద్యం బ్రాండ్లను టెస్ట్‌కు పంపిస్తేఅసలు విషయాలు బయటపడతాయని చెప్పారు. ఈవిషయంపై తాను ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు సిద్ధమా అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఛాలెంజ్ చేశారు.

Tags:    

Similar News