DSP Chaitanya: అమాయక ప్రజలపై డీఎస్పీ చైతన్య దాష్టీకం.. వెనుక ఉంది వాళ్లే..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నేటికి మూడు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ తాడిపత్రిలో ఘర్షణలు సద్దుమణగలేదు.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నేటికి మూడు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ తాడిపత్రిలో ఘర్షణలు సద్దుమణగలేదు. నిత్యం దాడులతో తాడిపత్రి అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులు రౌడీయిజం చేస్తూ, అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టుపక్కలా నివసిస్తున్న టీడీపీ వర్గీయులపై డీఎస్పీ చైతన్య దాడులకు పాల్పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాడిపత్రిలో రాజంపేట డీఎస్పీ విలయతాండవం..!
ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య తాడిపత్రికి మకాం మార్చారు. దాడులు, ప్రతి దాడులతో అట్టుడుకుతున్న తాడిపత్రిలో ఘర్షణ సెగలను చల్లార్చాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న డీఎస్పీ చైతన్య బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. సద్దుమణగుతున్న ఘర్షణలను తట్టిలేపారు.
రాత్రి 1 గంట ప్రాంతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇల్లకు వెళ్ళి నిద్రపొతున్న ప్రజలను లేపి బలవంతంగా బయటకు ఈడ్చుకు వచ్చారని, ఏంటని ప్రశ్నించినందుకు పోలీసు వ్యాన్ దగ్గరకి తీసుకువచ్చిన తరువాత డీఎస్పీ చైతన్య చావగొట్టమని పోలీసులకి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. కాగా డీఎస్పీ చైతన్య ఆదేశాల మేరకు తమని విచక్షణారహితంగా కొట్టారని బాధితులు ఆవేధన వ్యక్తం చేశారు.
రాజంపేట డీఎస్పీ చైతన్య విషయంలో చేతులెత్తేసిన అధికారులు..
రాజంపేట డీఎస్పీగా బాథ్యతలు నిర్వహిస్తున్న చైతన్య తాడిపత్రికి పంపింది ఎవరు అనే ప్రశ్నకి సమాధారం లేదు. అధికారులు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని అంటున్నారు.
డీఎస్పీ చైతన్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.. టీడీపీ డిమాండ్
రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్యను తాడిపత్రికి ఎవరు పంపించారు? అనే దానిపై సమగ్ర విచారణ చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. టీడీపీ కార్యకర్తలపై బౌతికదాడులకు పాల్పడిన డీఎస్పీ చైతన్యను వెంటనే సస్పెండ్ చెయ్యాలని, అలానే డీఎస్పీ చైతన్య, పై అధికారుల ఆదేశాలు లేకుండానే తాడిపత్రికి వచ్చి ఉంటే, అతన్ని వెంటనే డిస్‌మిస్ చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
ప్రజారక్షణకు కాదు కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగులు మడుగులొత్తే అందుకే డీఎస్పీ చైతన్య
ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా చైతన్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండున్నర ఏళ్ల క్రితం తాడిపత్రి డీఎస్పీగా చైతన్య బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం చెబితే అదే చేశారని, పెద్దారెడ్డి మాటే చైతన్యకు వేదవాక్కు అనే ఆరోపణలు ఉన్నాయి. అలానే పెద్దారెడ్డి ఆదేశాల మేరకు గతంలో టీడీపీ కార్యకర్తలపై బౌతికదాడులకు పాల్పడడమేకాకుండా, వాళ్లపై అక్రమ కేసులు కూడా పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో మంగళవారం అర్థరాత్రి చైతన్యను తాడిపత్రికి పంపించారని, ఇదే అవకాశంగా తీసుకుని చైతన్య చెలరేగిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది.