‘హ్యాండ్’ ఇచ్చారు.. పదవులకు ఫస్ట్.. ప్రచారానికి లాస్ట్..!

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరులో కాంగ్రెస్​నేతలు ముఖం చాటేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు కనిపించడం లేదు. ఇటీవల టీపీసీసీ చీఫ్​మార్పు అంశంపై పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారానికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో టీపీసీసీ చీఫ్ ​ఉత్తమ్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ​సెగ్మెంట్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నా… వారి వెంట సైతం సీనియర్ నాయకులు కనిపించడం లేదు. దీంతో అసలు సమయంలో నాయకులు చేతులెత్తేశారని కాంగ్రెస్​శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అభ్యర్థులు […]

Update: 2021-03-04 13:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరులో కాంగ్రెస్​నేతలు ముఖం చాటేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు కనిపించడం లేదు. ఇటీవల టీపీసీసీ చీఫ్​మార్పు అంశంపై పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారానికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో టీపీసీసీ చీఫ్ ​ఉత్తమ్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ​సెగ్మెంట్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నా… వారి వెంట సైతం సీనియర్ నాయకులు కనిపించడం లేదు. దీంతో అసలు సమయంలో నాయకులు చేతులెత్తేశారని కాంగ్రెస్​శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై అభ్యర్థులు సైతం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్​ సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, జీవన్​రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబు, షబ్బీర్​అలీ, మధుయాష్కి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు ఇప్పుడు ప్రచారంలో అభ్యర్థులతో కలిసి రావడం లేదు. దీంతో అభ్యర్థులు ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్లో ప్రచారానికి వెళ్లినా… ఆ తర్వాత దూరంగానే ఉంటున్నారు.

ఇటీవల కాలంలో ఎంపీ రేవంత్​రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరగగానే.. వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగగానే రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. టీపీసీసీ రేసులో ఉన్న ఇతర నేతలు సైతం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలంతా రేవంత్‌రెడ్డికే పగ్గాలివ్వాలని కోరుతున్నా.. సీనియర్లు అడ్డుపడుతూనే ఉన్నారు. దీంతో టీపీసీసీ అంశం ఇప్పట్లో తేల్చేది లేదంటూ అధిష్టానం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్​వచ్చింది. ఈ మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకపవనాలు వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్​పట్టు సాధించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ అధిపత్యపోరు నేతలను కలువకుండా చేస్తోంది.

వరంగల్ సెగ్మెంట్‌లో రాములు నాయక్, హైదరాబాద్​సెగ్మెంట్‌లో చిన్నారెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నా నేతల వైఖరితో ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సెగ్మెంట్ల పరిధుల్లో కాంగ్రెస్​ సీనియర్లు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి జానారెడ్డి, ఉత్తమ్​, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నప్పటికీ.. ఉత్తమ్​మినహా మిగతా నేతలు ప్రచారానికి హాజరుకావడం లేదు. టీపీసీసీ చీఫ్​పీఠం కోసం పోటీపడిన జీవన్‌రెడ్డి, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డిది సైతం అదే పరిస్థితి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సంబంధించిన బాధ్యతలన్నీ రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారం కోసం రావాలని ఇప్పటికే సీనియర్లను కోరినా వారు రావడం లేదంటూ అభ్యర్థులు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి​ఠాగూర్‌కు సమాచారమిచ్చారు. ఉత్తమ్​సైతం ఠాగూర్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు.

Tags:    

Similar News