విడాకుల తర్వాత ఏదో తెలియని బాధ.. సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇన్స్పిరేషనల్ కోట్ పోస్ట్ చేయగా అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకులకు ముందు #MyMummaSaid(మా అమ్మ చెప్పింది)అంటూ కొన్ని రోజులుగా వరుసగా పోస్టులు షేర్ చేసిన సామ్.. ఈ క్రమంలో మరో ఫొటోను షేర్ చేసింది. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో నాకు మళ్లీ నిలబడేంత సత్తా ఉంది. నేను చాలా బలవంతురాలిని. ఇతరులకు […]
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇన్స్పిరేషనల్ కోట్ పోస్ట్ చేయగా అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకులకు ముందు #MyMummaSaid(మా అమ్మ చెప్పింది)అంటూ కొన్ని రోజులుగా వరుసగా పోస్టులు షేర్ చేసిన సామ్.. ఈ క్రమంలో మరో ఫొటోను షేర్ చేసింది.
‘ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో నాకు మళ్లీ నిలబడేంత సత్తా ఉంది. నేను చాలా బలవంతురాలిని. ఇతరులకు నేను పర్ఫెక్ట్ అనిపించకపోవచ్చు. కానీ నాకు నేను పర్ఫెక్ట్. నన్ను నేను అమితంగా ప్రేమించుకుంటాను. ఈ విపత్కర పరిస్థితుల్లో విజయం సాధిస్తాను. నేనొక యోధురాలినని మా అమ్మ చెప్పింది’ అంటూ సామ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విడాకుల తర్వాత సమంత మానసికంగా ఒత్తిడికి లోనవుతుందని, ఆమెలో ఏదో తెలియని బాధ దాగి ఉందని అంటున్నారు.