వైరల్ వీడియో : ప్రధాని మోడీ డిజిటల్ డ్యాన్స్.. ఎంజాయ్ చేశానంటూ ట్వీట్
లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయనాయకులపై ఆరోపణలు, విమర్శలు పెరిగిపోయాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయనాయకులపై ఆరోపణలు, విమర్శలు పెరిగిపోయాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. కానీ, ప్రధాని మోడీ మాత్రం.. తనపై వచ్చిన మీమ్ గురించి స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందించిన తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన వీడియో చూసి ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు.
కృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ప్రధాని మోడీ స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. మోడీని డిక్టేటర్ తో పోలుస్తూ ఆ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు. ‘మీ లాగే నేనూ నా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశా’ అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ఎన్నికల టైంలో ఇలాంటి టాలెంట్ చూస్తే సంతోషంగా ఉందని అన్నారు. ఇది చూసి మోడీపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. కూలెస్ట్ పీఎం అని ఆయన్ని ప్రశంసిస్తున్నారు.
Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀
— Narendra Modi (@narendramodi) May 6, 2024
Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R