బాంబు బెదిరింపుల గాలివార్తలపై యుద్ధం.. కేంద్రం కసరత్తు

ల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపుల వ్యవహారంపై కేంద్రం కసరత్తులు చేస్తోంది.

Update: 2024-05-06 18:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంపై కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల కోసం వివరణాత్మక ప్రోటోకాల్ సహా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాల్సిన అవసరంఉందని నొక్కిచెప్పింది కేంద్రహోంశాఖ. తప్పుడు సమాచారం వల్ల అనవసర భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు పాఠశాలతో సమన్వయం కావాలని ఢిల్లీ పోలీసులను కోరింది. పాఠశాలల్లో భద్రత, సీసీటీవీ కెమెరాలు, ఈమెయిల్స్ ని తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎస్, సీపీతో కేంద్ర హోంశాఖ సమావేశం అయ్యింది. ఆ తర్వాతే ఈ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవలే బాంబు బెదిరింపులతో దేశరాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఏకకాలంలో 200 కంటే ఎక్కువ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. భయాందోళనలకు గురైన పేరెంట్స్ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లారు. తర్వాత అధికారులు జరిపిన సోదాల్లో ఏమీ దొరకలేదు. ఇదంతా బూటకమని తేలింది.

వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్స్ ని వాడి ఈ మెయిల్స్ పంపారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. విదేశీ సర్వర్ల ద్వారా డేటాను రూట్ చేసి.. తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ మెయిల్ పంపేందుకు రష్యన్ కంపెనీకి చెందిన మెయిలింగ్ సర్వీస్ ను వాడారని తెలిపారు.

మరోవైపు, సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని కనీసం 16 పాఠశాలలకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ కేసుల్లో గమనించినట్లుగానే మెయిల్స్ అన్నీ రష్యా డొమైన్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Similar News