అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాదిలో ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ఇటవల వెల్లడించింది. అయితే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు స్పష్టం […]

Update: 2021-10-17 21:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాదిలో ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ఇటవల వెల్లడించింది. అయితే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర తెలంగాణపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. బంగాళాఖాతం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి ఈ ఆవర్తనం వరకు 1500 మీటర్ల వరకు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

Tags:    

Similar News